KCR | సౌందరరాజన్ మరణం హైందవ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు : కేసీఆర్
KCR | తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన చిలుకూరి బాలాజీ (Chilukuri Balaji ) దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ ( Soundararajan ) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) సంతాపం ప్రకటించారు. సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ, తనదైన శైలిలో దైవ సేవ చేయడం ద్వారా, సౌందరరాజన్ ‘ప్రజా పూజారి’ గా ప్రసిద్ధి గాంచారని అన్నారు.
ప్రజా జీవనంలో భాగమైన హిందూ మత సాంప్రదాయ విలువలను విశదీకరిస్తూ, సమానత్వ భావనతో ప్రజలకు ఆధ్యాత్మిక సేవను అందిస్తూ, స్వామి భక్తులతో పాటు సభ్య సమాజ గౌరవాన్ని పొందిన అరుదైన పూజారి సౌందరరాజన్ అని కొనియాడారు. వారు అనుసరించిన ఆధ్యాత్మిక విధానాలు భవిష్యత్‌లో అర్చక సేవను వృత్తిగా ఎంచుకునే యువతకు ఆదర్శనీయమని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆయన మరణం హిందూ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. సౌందరరాజన్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు, భక్తులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

