హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సి.ఎస్. సౌందరరాజన్ (Soundararajan) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను ఎంతో కలిచివేసిందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో సౌందరరాజన్ పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు
. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడటం, దళిత గోవిందం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సామరస్యతకు కృషి చేశారని గుర్తు చేశారు. సౌందరరాజన్ మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. నిరాడంబరతకు, సేవా గుణానికి ఆయన నిదర్శనం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు , చిలుకూరు బాలాజీ భక్తులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.