Lucknow Super Giants : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కొత్త జెర్సీని విడుదల చేసింది. ఉత్రరప్రదేశ్ వారసత్వ సంపద, చారిత్రక కట్టడాలను ప్రతిబింబించేలా లోగోను రూపొంచింది యాజమాన్యం.. శుక్రవారం సరికొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఎరుపు రంగుపై నీలం రంగు నిలువు గీతలు.. గరుడ, కిరీటం, ఏనుగు బొమ్మల లోగోతో ఆకట్టుకునేలా ఉన్న జెర్సీ వీడియోను ఫ్రాంచైజీ తమ ఎక్స్ పోస్ట్‌లో పెట్టింది. కెప్టెన్ రిషభ్ పంత్, ఎడెన్ మర్క్రమ్, పేసర్ మహమ్మద్ షమీలు కొత్త జెర్సీని ధరించి మురిసిపోయారు.
ఐపీఎల్ ట్రోఫీ వేటక సిద్ధమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ 19వ సీజన్ నుంచి కొత్త జెర్సీతో మైదానంలోకి దిగనుంది. ఉత్తరప్రదేశ్ లక్నో పట్టణం చరిత్రను ప్రతిబింబించేలా జెర్సీని రూపొందించారు. వారణాసిలో గంగానది ఒడ్డున పట్టే మహా హారతి నుంచి వెలువడే దట్టంగా వెలువడే ధూపం.. చారిత్రక కట్టడం తాజ్ మహల్ తేజస్సు.. ఆగ్రాకోట వెలుగులు.. గంగా జలాల పరవళ్లు.. ఈ నాలుగు కలగలిసినట్టుగా జెర్సీ రంగు, డిజైన్ తయారు చేశారు. ఇక లోగోపై గరుగ్మంతుడు, కిరీటం, ఏనుగు బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
UP ki shaan seene par, trophy ka sapna aakhon mein… 🤩❤️💙 pic.twitter.com/rBAc4KO1VN
— Lucknow Super Giants (@LucknowIPL) February 27, 2026
Looks like Aiden has received something cool, any guesses what it could be? 👀 pic.twitter.com/qpWM330Lvd
— Lucknow Super Giants (@LucknowIPL) February 27, 2026
ఉత్తరప్రదేశ్.. లక్నో పట్టణ విశిష్టతను, స్ఫూర్తిగాథను చాటేలా సరికొత్తగా.. అభిమానులకు అమితంగా నచ్చేలా కొత్త లోగో రూపొందించారు. తాజా లోగోలో శక్తివంతమైన గరుడు, కిరీటం, ఏనుగు బొమ్మలు ఉన్నాయి. గరుడ (గరుత్మంతుడు) చిహ్నం ధైర్యానికి ప్రతీక. సవాళ్లను స్వీకరించడం.. వెనక్కి తిరిగి చూడకపోవడం, ఉన్నత శిఖరాలకు చేరడాన్ని సూచిస్తుంది. లక్నో జట్టు అనుసరించే భయమన్నది ఎరుగని క్రికెట్‌ను, సమిష్టిగా ఆడితే అసాధ్యమైన లక్ష్యమంటూ ఉండదని చాటుతుంది.
కిరీటం విషయానికొస్తే దర్పం, బాధ్యతకు ప్రతీక. మైదానంలోకి దిగిన ప్రతిసారి లక్షలాదిమంది ఆశల్ని లక్నో జట్టు మోస్తుంది.
Junoon hai, Toofan hai. Lucknow Super Giants ki ye ek nayi udaan hai 💙❤️ pic.twitter.com/xaLnnnZcwr
— Lucknow Super Giants (@LucknowIPL) February 24, 2026
లక్నో జెర్సీ ధరించడం ఎంతో గర్వకారణం. ప్రతిరోజు ఈ గౌరవాన్ని పొందాలని కిరీటం సూచిస్తుంది. కొత్త లోగుకు ఏనుగు బొమ్మ గుండెతో సమానం. బలం, తెలివి, ఓపిక, ఐక్యత.. ఈ లక్షణాలకు ప్రతిరూపమే ఏనుగు. ఫలితంతో సంబంధం లేకుండా సీజన్ సీజన్‌కు అభిమానుల నుంచి లభిస్తున్న నిరంతర మద్దతు, వారు చూపించే కృతజ్ఞతా భావానికి బొమ్మ ప్రతీక. క్లుప్తంగా చెప్పాలంటే లక్నో వీధులకు సబంధించిన లోగో ఇది. ఇంట్లో ఉండి క్రికెట్ మ్యాచ్‌లు చూసే కుటుంబాలు, ఏదో ఒకరోజు లక్నో జెర్సీ వేసుకోవాలని ఆశపడే యువతకు ఇది ప్రతిబింబిం. కొత్త లోగో.. ఈ ప్రాంత చరిత్ర, గౌరవం, ఐకత్య సందేశానికి ప్రతీక.