కోల్‌కతా: కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్ ఏరియాలో సుమారు 2000 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం ఇవాళ శంకుస్థాపన చేశారు. అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ, బెంగాల్ సీఎం సువేంధు అధికారి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ ఆరోగ్య మందిర్ భూమి పూజ కార్యక్రమంలో అదానీ భార్య, అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీ కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అదానీ ఆరోగ్య మందిర్‌కు సీఎం అధికారి భూమిపూజ చేశారు. న్యూ టౌన్లో ఉన్న యాక్షన్ ఏరియాలోని 51 ఎకరాల్లో ఆరోగ్య మందిర్‌ను నిర్మించనున్నారు.
ఆస్పత్రిలో సగం బెడ్స్‌ను పేద పేషెంట్లకు కేటాయించనున్నట్లు సీఎం అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు గౌతం అదానీ నగరంలోని కాళీఘాట్ ఆలయంలో పూజలు చేశారు. బెంగాల్లో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ తెలిపారు. 2035 నాటి కల్లా ఆ పెట్టుబడులు సాగనున్నట్లు చెప్పారు. పోర్టులు, లాజిస్టిక్స్, పవర్, రోడ్డులు, డేటా సెంటర్లలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని గౌతమ్ అదానీ తెలిపారు. మల్టీ స్పెషాల్టీ ఆరోగ్య మందిర్ నిర్మాణం కోసం సుమారు 4వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. సుమారు 10వేల మందికి ఉద్యోగ ఉపాధి ఇవ్వనున్నారు.
VIDEO | Kolkata: West Bengal CM Suvendu Adhikari, Adani Group Chairman Gautam Adani and others attend the foundation stone laying ceremony of Adani Arogya Mandir.#KolkataNews #AdaniArogyaMandir
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/9czZw0mUo6
— Press Trust of India (@PTI_News) September 24, 2026