Traffic Fine | తొమ్మిది మంది మరణానికి కారణమైన బస్సుకు లక్షన్నరకు పైగా ఫైన్
Traffic Fine | గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతమంది మరణానికి కారణమైన ఆ బస్సుకు రూ. లక్షన్నరకు పైగా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయి.
Traffic Fine | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) యమనా ఎక్స్ప్రెస్ వేపై గురువారం తెల్లవారు జామున స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 60కి పైగా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయి. వీటిలో 20కి పైగా ఫైన్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వ వాహన వెబ్సైట్ రికార్డులు వెల్లడించాయి. బిహార్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ BR 32PA 8647 నంబర్ గల ఈ బస్సు మొత్తం రూ. 1.7 లక్షలకు పైగా ట్రాఫిక్ ఫైన్ చెల్లించాల్సి ఉంది.
ఢిల్లీలోని మయూర్ విహార్లో ఆగస్టు 19న విధించిన జరిమానా అత్యధికమైంది. క్యారేజ్ పై భాగంలో సరుకులను తీసుకెళ్లినందుకు రూ. 18,500 ఫైన్ వేశారు. ఇన్ని ఫైన్లు ఉన్న ఈ బస్సు తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి వస్తున్న ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్ క్యాబిన్ నుంచి ఏదో కాలుతున్న వాసన రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్, కండక్టర్లకు తెలియజేశారు. కానీ డ్రైవర్ వెంటనే ఆపకుండా సిగరెట్ తాగుతూ వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. కొద్దిసేపటికే డ్రైవర్ సీటు సమీపంలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయని FIRలో రాశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (AdityaNath) ఆర్థిక సాయం ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందజేయనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

