– దానం లత, కల్లూరు
ఇంటికి ఇచ్చే ఎలివేషన్ ప్రధానంగా తూర్పును మూయకుండా ఉండాలి. పూర్తిగా అద్దాలతో బిగించి బాక్స్‌లాగా చేయవద్దు. ఉత్తరం వైపు కూడా అలాగే ఓపెన్‌గా ఉంచాలి. ఆగ్నేయంలో కిందినుంచి పైఅంతస్తు చివరి వరకూ గ్లాస్‌తో మూయవద్దు. భూమిని ఆధారంగా తీసుకోకుండా.. ఫస్ట్‌ఫ్లోర్ స్లాబ్ అంచు బీమ్‌ను బేస్‌గా చేసుకొని ఎలివేషన్ ఉండాలి. సాధారణంగా తూర్పు-ఉత్తరాలలో బాల్కనీ భాగాన్ని వెనక్కి-ముందుకు పెంచకుండా పట్టీలతో, పిన్నులతో బిగిస్తారు. అప్పుడు వెనక్కి-ముందుకు వచ్చినా దోషం ఉండదు. ఈశాన్యం, ఉత్తరం, తూర్పు దిశలు ఓపెన్ ఉండేలా ఎలివేషన్ చేసుకోవచ్చు. ఇంటిలోకి గాలి-వెలుతురు రాకుండా అడ్డుపడే ఎలివేషన్లు మంచివి కావు.
– ఎం.రాధ, బాలానగర్
చాలామంది దక్షిణం దిశ, దక్షిణ ద్వారాలను తెలియకుండానే దూరం పెడుతున్నారు. అది తప్పు. ప్రతి దిశకూ ప్రాధాన్యత ఉంది. దక్షిణం మధ్యలో దక్షిణ-ఆగ్నేయంలో ద్వారాలు పెట్టుకోవచ్చు. కొందరు దక్షిణం సెంటర్ ద్వారాలు తప్పుగా భావిస్తారు. ఉత్తరం ద్వారం లేకుండా దక్షిణం ద్వారాలు ఉన్నప్పుడు దోషం అవుతుంది. దక్షిణ-నైరుతి వైపు మాత్రమే ద్వారం పనికి రాదు.

దక్షిణం, పడమర, ఉత్తరం, తూర్పు ఇవి ఆ వైపు భాగంలో విస్తీర్ణం కలిగి ఎక్కువ స్థలంలో ఉంటాయి. అంటే దక్షిణం భాగాన్నీ ‘తొమ్మిది’ ముక్కలుగా చేస్తే.. అందులో రెండు భాగాలు దక్షిణ-నైరుతి, రెండు భాగాలు దక్షిణ-ఆగ్నేయం అవుతుంది. మధ్య ఐదు భాగాలు దక్షిణ స్థానం, దానిలో మధ్య ద్వారం రావడం మంచిదే. దోషంగా భావించరాదు.
– ఇండ్ల చంద్రం, ఆత్మకూర్
ఇంటిలోని టాయిలెట్ ఫ్లోరింగ్‌ని ఇంటితో సమానంగానే చేసుకోవచ్చు. నీళ్లు బయటికి రాకుండా గడపను సిమెంట్తోనైనా పెట్టుకోవడం మంచిది. బాత్రూం లోతు చేయడం అనవసరం. సహజంగా దక్షిణం-పడమర, ఆగ్నేయ-వాయవ్యాలలో టాయిలెట్లు కడుతుంటారు. వాటిని ఎత్తు చేసినా సరేకానీ లోతు చేయకూడదు.

టాయిలెట్లలో వాడుకున్న నీరు పోవడానికి జాట్వెల్ను ఆ గది ఈశాన్యంలో లేదా తూర్పులోంచి వెళ్లేలా ఏర్పాటు చేయాలి. దాదాపు ఎక్కువ శాతం లోతుచేసి అందులో పైపు లైన్లు బిగించి, దానిని మూసి వేసే విధానంతో టాయిలెట్ ఫ్లోరింగ్‌లో తక్కువ-ఎక్కువలు రాకుండా ఉంటాయి. అయితే కిందికి లీక్ అవ్వకుండా జాగ్రత్త వహించడం అవసరం.
– కొంపెల్లి రాధ, మేడ్చల్
పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు ఉన్న స్థలాలకు సెల్లారు తీసుకోవచ్చు. అయితే ఆ సెల్లారులోకి పోవడానికి ర్యాంపు మొత్తం దక్షిణం మధ్యలో లేదా దక్షిణ-ఆగ్నేయంలో ఇవ్వాలి. తూర్పు నుంచి కానీ, ఉత్తరం నుంచి కానీ ఇవ్వకూడదు. దక్షిణం వచ్చే రెండు ద్వార స్థానాలల్లో ఒకటి దక్షిణ-ఆగ్నేయం నుంచి.. నిర్మాణంలోకి వెళ్లడానికి దక్షిణం మధ్యనుంచి సెల్లారులోకి వెళ్లేలా ఎంట్రీలు ఏర్పాటు చేయాలి.

అప్పుడే ఉత్తరం వాలుగా లోపలికి వెళుతాం. అలాగే పడమర-వాయవ్యం నుంచి కూడా సెల్లారులోకి వెళ్లేలా ర్యాంప్ పెట్టుకోవచ్చు. ఒకేవైపు రావడం-పోవడం కాకుండా.. దక్షిణ-ఆగ్నేయం నుంచి లోపలికి దిగి, పశ్చిమ-వాయవ్యం నుంచి బయటికి వచ్చేలా కూడా సెల్లారు మార్గాలు ఉండవచ్చు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143