Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని మొదటి పాటైన ‘నారాయణమ్మ’ సాంగ్‌ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటపై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, నివేతా థామస్, డింపుల్ హయతి తదితరులు నటిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
The FIRST SINGLE is ready to set the vibe! 💥🕺💃#Narayanamma from #AadarshaKutumbam 🏠
OUT ON SEPTEMBER 22nd! 🎵🔥A @MusicThaman BANGER is loading! 🥁🎹🔥#AK47OnOCT2nd | #Venky77 | #VenkateshXTrivikram
Victory @VenkyMama #Trivikram @SrinidhiShetty7 @IamRohithNara… pic.twitter.com/oY9oEKqp9Z
— Haarika & Hassine Creations (@haarikahassine) September 21, 2026