UNO Meet | యుద్ధాలు, ఘర్షణల నడుమ సమావేశం కాబోతున్న ఐక్యరాజ్యసమితి.. మోదీ, జిన్‌పింగ్, పుతిన్ లేకుండానే..!
UNO Meet | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్రమైన యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధాలు, ఘర్షణల నడుమనే ఈ వారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNO General Assembly) వార్షిక ఉన్నతస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ కీలక భేటీకి 140 మంది ప్రపంచ నేతలు, మరో 53 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు.
UNO Meet : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తీవ్రమైన యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధాలు, ఘర్షణల నడుమనే ఈ వారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNO General Assembly) వార్షిక ఉన్నతస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ కీలక భేటీకి 140 మంది ప్రపంచ నేతలు, మరో 53 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ (Ukraine war) యుద్ధం, గాజా (Gaza) లో సంక్షోభం, సూడాన్ (Sudan) లో కొనసాగుతున్న అంతర్యుద్ధం వంటి అంశాలు ఈ సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
మంగళవారం ఈ సమావేశాలు ప్రారంభం కానుండగా.. సంప్రదాయం ప్రకారం ముందుగా బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా తొలి ప్రసంగం చేయనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తారు. అయితే ఈసారి సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ముగ్గురు కీలక నేతలు గైర్హాజరవుతున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
‘విశ్వాసాన్ని పునరుద్ధరించడం, పరివర్తనను నిర్వహించడం : అందరి కోసం పనిచేసే ఐరాస’ అనే థీమ్‌తో ఈ ఏడాది సమావేశాలు జరగనున్నాయి. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, ప్రపంచ ఆకలి, పేదరికం వంటి శాశ్వత సమస్యలతోపాటు కృత్రిమ మేథ (ఏఐ) తో ముంచుకొస్తున్న ప్రమాదాలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎన్నికైన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
ప్రధాన సభలో నేతల ప్రసంగాలు లాంఛనప్రాయంగా సాగినా.. అసలైన చర్చలు, దౌత్యపరమైన మంతనాలు మాత్రం తెరవెనుకే జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. గత ఏడాది ఇలాంటి సమావేశాల సందర్భంగానే అమెరికా, కొన్ని ముస్లిం దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా గాజా శాంతి ప్రణాళిక రూపుదిద్దుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో ఐరాసను విమర్శించే ట్రంప్ కూడా ఏకీభవించడం గమనార్హం.
ఈ సమావేశాల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం చేసిన మరుసటి రోజే, ఆ దేశ ప్రత్యర్థి అయిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రసంగించనుండటం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు గాజాలో తమ చర్యలను సమర్థించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం ప్రసంగించనుండగా.. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు అమెరికా వీసా నిరాకరించడం వివాదాస్పదంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

