కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ లిస్ట్‌లో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకురాలి పేరు ఉన్నది. దీంతో అధికార తృణమూల్, బీజేపీపై మండిపడింది. బెంగాల్ ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు నకిలీ ఓటర్లను చేరుస్తున్నారని ఆరోపించింది. (Maha BJP Leader Name In Bengal Voter List) బీర్భూమ్ జిల్లాలోని దుబ్రాజ్పూర్ మున్సిపాలిటీ 12వ వార్డు ఓటర్ల జాబితాలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకురాలు ఉజ్వల బురుంగ్లే పేరు కనిపించింది. నాసిక్‌కు చెందిన ఆమెకు మహారాష్ట్రలో ఓటు ఉన్నది. తాజాగా అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఉజ్వల పోటీ చేసింది. ఆమెకు రెండు చోట్ల ఓటు ఉండటాన్ని ఎన్నికల అధికారులు గుర్తించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విచారణ కోసం నోటీసు జారీ చేశారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దీనిపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపించింది. సీఎం మమతా బెనర్జీ దీనిపై పదే పదే ఆరోపణలు చేశారని, అది నిజమని ఇప్పుడు రుజువైనట్లు ఆ పార్టీ నేత విమర్శించారు. ‘పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో అక్రమ ఓటర్లను చేర్చాలని బీజేపీ చూస్తోంది. దీనికి ఇదే నిదర్శనం. దీనిపై విచారణ జరుపాలని ఎన్నికల సంఘాన్ని కోరతాం’ అని అన్నారు.
Also Read:
Professor Stabbed At Station | రైల్వే స్టేషన్లో.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?