అహ్మదాబాద్: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ స్థలంలో నిర్మిస్తున్న వంతెన పిల్లర్ పైనుంచి భారీ మెటల్ ప్లేట్ ఊడి పడింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి, అతడి కుమార్తె దాని కింద నలిగి నుజ్జై మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Man, Daughter Crushed) గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా తపతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తున్నారు.
కాగా, శనివారం సాయంత్రం కథోర్ గ్రామంలో నిర్మిస్తున్న పిల్లర్ పైనుంచి భారీ మెటల్ ప్లేట్ ఊడి పడింది. నదిలో చేపలు పడుతున్న 35 ఏళ్ల మొహసిన్ ఇక్బాల్ షేక్, అతడి తొమ్మిదేళ్ల కుమార్తె హుమా మొహసిన్ షేక్‌పై అది పడింది. భారీ మెటల్ ప్లేట్ చాలా బరువు ఉండటంతో వారిద్దరూ దాని కింద నలిగి నుజ్జై మరణించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. భారీ యంత్రాలతో ఆ మెటల్ ప్లేట్‌ను పక్కకు తొలగించారు. దాని కింద నలిగి మరణించిన తండ్రి, కుమార్తె మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం రుజువైతే, బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
Professor Stabbed At Station | రైల్వే స్టేషన్లో.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు
Watch: ప్రియుడిని పెట్టెలో దాచిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?