PM Modi: యూట్యూబ్‌లో ప్రధాని మోదీ రికార్డు.. 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు
PM Modi: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. తాజాగా ఆ ఫ్లాట్‌ఫామ్‌లో కొత్త మైలురాయి చేరుకున్నారు. యూట్యూబ్‌లో ప్రధాని మోదీని ఫాలోఅవుతున్న వారి సంఖ్య ఇప్పుడు మూడు కోట్లు దాటేసింది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో ప్రధాని మోదీ(PM Modi) రికార్డులు సృష్టిస్తున్నారు. యూట్యూబ్‌లో కీలక మైలురాయిని ఆయన దాటేశారు. యూట్యూబ్‌లో ప్రధాని మోదీ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసిన వారి సంఖ్య 3 కోట్లు దాటింది. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. గత వారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఘనత సాధించిన విషయం తెలిసిందే. అత్యధిక సంఖ్యలో యూజర్లు ఇన్‌స్టాలో మోదీని ఫాలోఅవుతున్నారు.
ప్రపంచ దేశాధినేతల్లో అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్న నేతగా ప్రధాని మోదీ నిలిచినట్లు తాజా ర్యాంకింగ్స్ చెబుతున్నాయి. అయితే ఆ ర్యాంకింగ్స్ ప్రకారం ఆయన ఇతర నేతలతో పోలిస్తే చాలా చాలా ముందున్నారు. ఇక ఆ జాబితాలో రెండో స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో ఉన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగో వంతు మాత్రమే బొల్సనారోను ఫాలో అవుతున్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నా ఏడు రెట్లు అధికంగా ప్రధాని మోదీకి యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇక ఇండియాలో అత్యధిక మంది సబ్స్క్రైబర్లు ప్రధాని మోదీకే ఉన్నారు. రాహుల్ గాంధీ కన్నా ఆయనకు మూడు రెట్లు అధికంగా ఫాలోవర్లు ఉన్నారు. 30 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లతో .. మోదీ యూట్యూబ్ ఛానల్.. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

