Haiwaan Teaser | బాలీవుడ్ ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘హైవాన్’ (Haiwaan). కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్ విడుదల కాగా, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ కలిసి ఒకే చిత్రంలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో, ‘హైవాన్’ టీజర్ విడుదల కాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
డైరెక్టర్ ప్రియదర్శన్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇందులో సైఫ్ బ్లైండ్ పాత్రలో కనిపించబోతుండగా అక్షయ్ కుమార్ సైకో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.