PM Modi | అడ్డదారులతో అంతిమంగా నష్టమే తప్ప లాభం లేదు.. నేటి యువతకు ప్రధాని మోదీ సూచన
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) నేటి తరం యువత (Zen-G) కి పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడవద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
PM Modi : ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) నేటి తరం యువత (Zen-G) కి పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడవద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ఢిల్లీ (Delhi) లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ : మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ఒక హెచ్చరికను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. “షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్ (అడ్డదారి మీ జీవితాన్ని కుదిస్తుంది)” అనే బోర్డు కేవలం రైల్వే ట్రాక్‌లకే కాకుండా నిజ జీవితానికి కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నప్పటికీ త్వరగా వెళ్లాలనే తొందరలో కొందరు ప్రమాదకరంగా పట్టాలు దాటుతుంటారని, అటువంటి అనాలోచిత నిర్ణయాలు ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు.
యువత తప్పుడు మార్గాలను వీడి అర్థవంతమైన జీవన గమనాన్ని ఎంచుకోవాలని ప్రధాని సూచించారు. “మీరు ఆరాధించే మహనీయుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదవండి. వాటి ద్వారా స్ఫూర్తి పొంది సరైన మార్గాన్ని కనుగొనవచ్చు” అని ఆయన యువతకు సలహా ఇచ్చారు. ముఖ్యంగా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్ పట్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

