న్యూఢిల్లీ: గర్భిణీ అయిన మహిళా కమాండోను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. డంబెల్‌తో తలపై పలుమార్లు కొట్టి చంపాడు. (Woman Commando Murdered) ఆ మహిళా కమాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల కాజల్ చౌదరి 2022లో ఢిల్లీ పోలీస్ శాఖలో చేరింది. ప్రస్తుతం స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందంలో మహిళా కమాండోగా ఆమె పని చేస్తున్నది.
కాగా, 2023లో రక్షణ శాఖ పరిధిలోని ఢిల్లీ కంటోన్మెంట్లో క్లర్క్‌గా పనిచేస్తున్న అంకుర్‌తో కాజల్‌కు వివాహమైంది. ఈ దంపతులకు ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాలపై తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
మరోవైపు జనవరి 22న నాలుగు నెలల గర్భవతి అయిన కాజల్‌ను భర్త అంకుర్ హత్య చేశాడు. సోదరుడితో ఫోన్లో మాట్లాడుతున్న ఆమె తలపై భారీ డంబెల్‌తో పలుమార్లు కొట్టాడు. ఫోన్లో ఉన్న కాజల్ సోదరుడికి ఆమెపై దాడి విషయాన్ని చెప్పాడు.
అయితే తలపై తీవ్ర గాయాలైన కాజల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 27న మరణించింది. ఈ నేపథ్యంలో కాజల్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తన సోదరిని వేధించినట్లు ఆరోపించాడు. పోలీసులు అంకుర్పై హత్య కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Stealing Software Data | రూ.87 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ డేటా చోరీ.. మాజీ టెకీపై కేసు
Watch: వృద్ధుడిని కొమ్ములతో ఎత్తి పడేసిన ఎద్దు.. తర్వాత ఏం జరిగిందంటే?