హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ( GHMC ) సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అకౌంట్ సెక్షన్ విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్ ( Suryavamsi Santosh ) లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతులను ఉన్నతాధికారులకు పంపాలని కోరగా అందుకు రూ.40 వేలు డిమాండ్ చేసి రూ.35వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎగ్జామినర్‌ను పట్టుకుని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరుచగా జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.