హిమాయత్‌నగర్,జూలై24: బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, నేతలు నాడేపల్లి సుశాంత్, డి.రాజేందర్ కుమార్,కొల్కుల శ్రీకాంత్, చింటు, కార్తీక్, నవీన్, సయ్యద్, యాదగిరి, ఇమ్రాన్, ప్రవీణ్, ఫసీయుద్దీన్, రామకృష్ణ పాల్గొన్నారు.
బేగంపేట్ జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థి నాయకులు అత్తెల్లి సాయి ప్రియాన్ష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్‌చేసి పంపిణీ చేశారు.

అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 7 సబ్జెక్ట్లతో కూడిన క్వశ్చన్ బ్యాంక్‌లను కళాసీగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి నాయకులు రాహుల్, యాసిన్, రూపేష్,
టింక్, మృణాల్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్ డివిజన్లోని ఫ్లోరా హోటల్ వద్ద కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, దేశిపాక శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, అబ్బాస్, అశోక్, సురేష్, అనిల్,రంజిత్, సాయి, శ్రీను, నర్సింహా, రమేష్ పాల్గొన్నారు.

గోల్నాక, జూలై 24: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమాజ సేవలో ముందుంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. బాగ్ అంబర్ పేట డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోర శ్రీరాములు ముదిరాజ్, అతని స్నేహితుడు, సివిల్ ఇంజనీర్ శ్రీధర్ తదితరులతో కలిసి అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా బస్ స్టాప్ వద్ద కొత్తగా బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్త బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించి మాట్లాడారు. తమ సొంత ఖర్చుతో బస్ స్టాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు విజయ్‌కుమార్ గౌడ్, బి.పద్మా వెంకట్‌రెడ్డి, ఎర్రబోలు నరసింహరెడ్డి, గెల్వయ్య, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దుండిగల్, జూలై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు శుక్రవారం దుండిగల్ సర్కిల్ పరిధి, శంభీపూర్‌లోని ఆయన కార్యాలయంలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలేంజ్‌లో భాగంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

ఖైరతాబాద్, జూలై 24 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు గజ్జెల ఆనంద్ నేతృత్వంలో శుక్రవారం ఖైరతాబాద్ బడా గణేశ్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులు, వారి కుటుంబ సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందు, శ్యామ్ గౌడ్, శ్రీనివాస్, అశోక్, వినీత్, అబ్బాస్, దీపు, శ్రీనివాస్ నాయుడు, పి.నరసింహా, విజయ్, సత్తి, రాహుల్, రఘు తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు చేయూతనందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని 12 అంగన్వాడీ సెంటర్లలో పేద విద్యార్థుల భోజన వసతికి అవసరమైన వంట సామగ్రిని ఆయన అందజేసి మాట్లాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం సహాయం చేస్తానని తెలిపారు.

శేరిలింగంపల్లి, జూలై 24: నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాగం హరిశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులకు దుస్తులను పంపిణీ చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవి ంద్, గద్దర్ రాజ్, రాజు ముదిరా జ్, వెంకట్ రెడ్డి, భీమ్ రాజ్, రాణి, పరమేష్, బాలరాజ్, రవికుమార్, నవాజ్, శ్రీకాంత్, సురేష్, నర్సింహ, ఎం.తిరుపతి, చందన్, సాంబ, అరుణ్, శ్రీను, రాము, నర్సి, రమేష్, తరుణ్ గోవర్ధన్, మోహన్, లోకేష్ పాల్గొన్నారు.

పీర్జాదిగూడ,జూలై24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుర్తి తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేమర్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎక్స్ దవాఖానా సహకారంతో నిర్వహించిన మెగా రక్తదానం శిబిరంలో యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి రఘువర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, మహేష్, మదుసూధన్‌రెడ్డి కౌడె పోచయ్య, నాయకులు రఘుపతిరెడ్డి, ఏనుగు మనోరంజన్‌రెడ్డి, నిర్మల, ప్రభు, వెంకట్, శ్రీనివాస్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.