నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 24 (నమస్తే తెలంగాణ) : రూ.100 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత కేసులో ఎకోరిన్ ఎనర్జీ ఎండీ లక్ష్మీ ప్రసన్నను అధికారులు శుక్రవారం నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది.
కాగా, మాదాపూర్ లోని ఎకోరిన్ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్న జీఎస్టీ అధికారులు.. నకిలీ ఇన్వాయిస్లు, టర్నోవర్ తారుమారు ద్వారా రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే దర్యాప్తులో వెల్లడైన ముఖ్యాంశాలను రిమాండ్ రిపోర్టులో నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. ఇక ఈ కేసులో ఇతర కంపెనీలతో ఎకోరిన్ జరిపిన లావాదేవీలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.