కార్పొరేషన్, జూలై 24 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాయి. కేటీఆర్ పిలుపు మేరకు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ ప్రజలకు తన సేవలను ఎల్లవేళలా అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో రేకుర్తిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా నోటు పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. మారెట్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కూరగాయల వ్యాపారులు, బాటసారులకు అల్పాహార వితరణ చేశారు.
32వ డివిజన్ హుస్సేనీపురాలోని మదర్సాలో చదువుతున్న సుమారు 150 మంది విద్యార్థులకు కార్పొరేటర్ షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. 33వ డివిజన్ కార్పొరేటర్ జమ్ము ఆధ్వర్యంలో డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పలకలు, బలపాలు, కంపాస్ బాక్సులు, బిసెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేటర్లు కాల్వ మల్లేశం, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, నాయకులు ఐలేందర్, గందె మహేశ్, రాజశేఖర్, సదానందాచారి, అనూప్ కుమార్, జమీలుద్దీన్, సుంకిశాల సంపత్‌రావు, ప్రశాంత్ రెడ్డి, చందు, రాజేందర్, కాటం సురేశ్, నరేశ్, ఏడబోయిన శ్రీనివాస్‌రెడ్డి, సత్తినేని శ్రీనివాస్, ఇర్ఫాన్ హుల్హాక్, వసంత రావు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, జూలై 24 : నగరంలోని రేకుర్తిలో గల బధిరుల పాఠశాలలో విద్యార్థులకు కేటీఆర్ అభిమాన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ ఇంతియాజ్, సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్ రూరల్, జూలై 24: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, లావణ్య, ప్రతాప తార-తిరుమల్‌రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
ఇల్లందకుంట జూలై 24: మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. కేక్‌ను కట్ చేసి పంచారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఓదెలు, రాంస్వరణ్‌రెడ్డి, మల్యాల సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్లు వీరస్వామి, కొమురెల్లి, నాయకులు వెంకటేశ్, కుమార్, రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, రఫీఖాన్, వేణు తదితరులున్నారు.
వీణవంక, జూలై 24: మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు కొనసాగిస్తున్న ధర్నాకు మద్దతుగా ఆర్టీసీ బస్‌ను ఆపి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, కోర్కళ్ సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, సర్పంచులు మ్యాడగోని తిరుపతి, మండల కుమారస్వామి, గజ్జెల మొగిలయ్య, నాయకులు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బల సమ్మిరెడ్డి, గెల్లు మల్లయ్య, మహిపాల్‌రెడ్డి, రమేశ్, భూమయ్య, ప్రశాంత్, గజ్జెల శ్రీకాంత్, నీల పున్నం, వోరెం మధు, వోరెం క్రాంతి, ప్రకాశ్, జీవరత్నం, సుధాకర్ పాల్గొన్నారు.

మానకొండూర్ రూరల్, జూలై 24: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో, పచ్చునూర్ గ్రామంలో యూత్ మండల వైస్ ప్రెసిడెంట్ పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పండ్లను పంపిణీ చేశారు. పచ్చునూర్లో 100 మంది రైతులకు టవల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పిట్టల మధు, పిండి సందీప్, మందల రాజేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లగల్ల నగేశ్, దాసరి వేణు గోపాల్, బోడ రాజశేఖర్, దండు రాములు, వెంకటస్వామి, గడ్డం సంపత్ తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం, జూలై 24: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. లాంగ్ లివ్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీలు పొద్దుటూరి సంజీవరెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిరుత రవీందర్, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెలవేని మహేశ్, పూదరి రాజు, విద్యాసాగర్‌రావు, మోత్కూరి సమ్మయ్య, చౌడమల్ల వీరస్వామి, ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, అంతం తిరుపతిరెడ్డి, మోరె శ్రీనివాస్, కాటం వెంకటరమణారెడ్డి, దాసారపు భద్రయ్య, ఆకుబత్తిని విజయ్‌కుమార్, హన్మంతు, గుర్రం శ్రీకాంత్, పంజాల సంపత్, గుర్రం శ్రీనివాస్, రవి, రమేశ్, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్, జూలై 24: మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గోడ గడియారాలను అందజేశారు. అలాగే, పలు గ్రామాల్లో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో రేణికుంట సర్పంచి ఎలుక ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ కనకం కొమురయ్య, నాయకులు సంజీవ రెడ్డి, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, జూలై 24: చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి సమకూర్చిన నోటు పుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్త సుమలత-గంగారెడ్డి, మాజీ జడ్పీటీసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల సౌజన్య-వినయ్, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, గడ్డం చుక్కారెడ్డి, మాజీ సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 24 : మండల కేంద్రంలోని వైశ్య భవన్లో బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, యువజన విభాగం మాజీ మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పాల్గొని పార్టీ నాయకులతో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వీర్ల మాట్లాడుతూ, కేటీఆర్ పిలుపు మేరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న అనేకమంది చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరం ద్వారా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డితో పాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు సుమారు 35 మంది రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే, గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమాల్లో వొంటెల వెంకటరమణారెడ్డి, గంట్ల రవీందర్‌రెడ్డి, గాదే మధూకర్‌రెడ్డి, బండారి ప్రవీణ్, గుడ్ల శేఖర్, వీర్ల సంజీవరావు, నాగి శేఖర్, దాసరి రాజేందర్‌రెడ్డి, పూడూరి మల్లేశం, వీర్ల కుందన్‌రావు, ఆరపెల్లి ప్రశాంత్, శనిగరపు అనిల్, అర్జున్, పంజాల జగన్మోహన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూలై 24 : మండలంలోని మధురానగర్‌లో కేటీఆర్ బర్త్‌డే కేక్‌ను నాయకులు కట్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, నాయకులు వేముల దామోదర్, రామిడి సురేందర్, శ్రీమల్ల మేఘరాజు, రాసూరి మల్లేశం, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, జోగు లక్ష్మీరాజం, మడ్లపెల్లి రమేశ్, బొల్లాడి అనంతరెడ్డి, ఎండీ అబ్బాస్, పొన్నం పరశురాములు, సముద్రాల అజయ్, జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.