కందుకూరు/బడంగ్పేట్ సెప్టెంబర్ 17 : గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేసినట్లు మాజీ మం త్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి నాలుగేండ్లు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ మండల ఎస్టీసెల్ ఆధ్వర్యంలో సామ నర్సింహారెడ్డి ఫం క్షన్ హాలులో ఏర్పాటు చేసిన గిరిజన సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఉ ద్యమ సమయంలో ప్రతి తండాలో పర్యటించి వారి స్థితిగతులను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరించారని తెలిపారు.
గిరిజన తండాలోనే కల్యాణలక్ష్మికి బీజం పడినట్లు పేర్కొన్నారు. 500 జనాభా ఉన్న ప్రతి తండాతోపాటు గూడాలను గ్రామ పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన సేవలను గిరిజనులు ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలన్నారు. బంజారాహిల్స్‌లో 2 ఎకరాల్లో రూ.100కోట్లతో గిరిజన భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మికి కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మాట మార్చారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీలో ఒక్క కంపెనీని తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. తమ స్వలాభం కోసం ఫ్యూచర్ సిటీ గురించి మాటలు తప్ప చేసిందేమి లేదన్నారు. మహేశ్వరం మండలంలోని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలుపడానికి తాను అడ్డంకి కాదని చెప్పారు.
కందుకూరు మండలంలోని గ్రామాలను కలిపే ముందు తనను అడిగారా అని ప్రశ్నించారు. కావాలని కొంత మంది నాయకులు తనపై బురద జల్లుతున్నారని అన్నారు. నాయకులు సభావత్ లచ్చానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, రవినాయక్, తేజానాయక్, దీప్లాల్ నాయక్, మంగ్లీ లచ్చానాయక్, సుజాత నాయక్, గంగాపురం లక్ష్మీ నర్సింహారెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, సామ మహేందర్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, డైరెక్టర్ సామ ప్రకాశ్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్‌రెడ్డి, సదానంద్‌గౌడ్, ఎండీ అంజద్, తాళ్ల నరేందర్ పాల్గొన్నారు.
గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దీప్లాల్ చౌహాన్ అన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు కల్పించి నేటితో 4సంవత్సరాలు అయిన సందర్భంగా బాలాపూర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులు, దళితులు, మహిళలు, కులవృత్తుల వారు, పేద ధనిక అని తేడా లేకుండా సమపాలన పాలన సాగించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ,రైతుబీమా, కేసీఆర్ కిట్టు ఇవ్వడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా బాల్‌రాజ్, లలిత జగన్, సువర్లత, రాము నాయక్, శ్రీను నాయక్, మోహన్ నాయక్, గోపీయాదవ్, అనిల్ కుమార్ యాదవ్, రాజ్ కుమార్, నర్సిరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.