హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇం డియా (ఎన్హెచ్ఏఐ) వరంగల్ ప్రాజెక్ట్ ఇం ప్లిమెంటేషన్ యూనిట్ (పీఐయూ) మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన భార్య ప్రవలిక పేరును సై తం ఎఫ్ఐఆర్లో చేర్చింది. 2016లో సెం ట్రల్ రోడ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శా స్త్రవేత్తగా దుర్గాప్రసాద్ చేరారు. 2022 సెప్టెంబర్ 16న డిప్యుటేషన్‌పై ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో డీజీఎంగా జాయిన్ అయ్యా రు.
అనంతరం ఖమ్మం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ డైరెక్టర్‌గా, వరంగల్ పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2024 ఆగస్టు 20 నుంచి 2025 ఆగస్టు 19 వరకు దుర్గాప్రసాద్ వరంగల్ ఎన్హెచ్ఏఐ పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన పనిచేసిన చోటల్లా.. లంచాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం రూ.8.9 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వీటిల్లో ఖర్చులుపోను రూ.1,03,06,339 విలువైన ఆస్తులు ఆదాయానికి మించినవిగా గుర్తించారు.