రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న తాజా సినిమా ‘మాయలేడి’. మధుమిత సర్కార్ కథానాయిక. ప్రశంకర్ దర్శకుడు. అక్టోబర్‌లో విడుదల కానున్నది. ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో కచ్చితమైన అభిప్రాయం ఉన్న క్రిష్ అనే యువకుడికి, ఆశా అనే ఫైర్ బ్రాండ్ లాంటి అమ్మాయి మధ్య కథ ఇది.
సహజంగా కోపిష్టి అయిన ఆశకు క్రిష్‌కి గతంలో రూపా అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని తెలుస్తుంది. కోపంతో ఊగిపోతుంది. రూపా గురించి తెలుసుకున్న ఆశా ఏం చేసింది? అనేది ఈ సినిమా కథ.