హైదరాబాద్, సెప్టెంబర్ 17 నమస్తే తెలంగాణ) : ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్వంటి మహానేతపై అసెంబ్లీలో చిల్లరగా మాట్లాడటం సిగ్గుచేటని ఒక ప్రకనటలో మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో జరిగిన అక్రమాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి సభను తప్పుదోవపట్టించారని ఆక్షేపించారు. కేసీఆర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారంటూ సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.