హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బదిలీ ఉత్తర్వులకు సంబంధించి 11 ఏండ్ల క్రితం దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసిన కానిస్టేబుల్ రాంచందర్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సైనిక్ సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. 2015 ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ బెటాలియన్‌కు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ బీ రాంచందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీన్ని 2015 మార్చి 11న కొట్టివేస్తూ బీజాపూర్‌లో విధుల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఇబ్బందులుంటే వినతిపత్రం సమ్పించాలని, దాన్ని ఉన్నతాధికారులు సానుభూతితో పరిశీలిస్తారని హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ మరుసటి రోజే రాంచందర్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టి ప్రతివాదులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా వాటిని అమలు చేయలేదంటూ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని అన్నారు. ఇది న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేరొన్నారు. కోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రూ.25 వేలు జరిమానాగా చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.