Jaggery Test | ఈ చిన్న టెస్టు చేస్తే మీరు కొన్న బెల్లంలో కల్తీ జరిగిందా, లేదా సులభంగా తెలుసుకోవచ్చు..!
చాలా మంది ఇండ్లల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో బెల్లం కూడా ఒకటి. తీపి పదార్థాల తయారీలో, ఆయుర్వేద పానీయాల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Jaggery Test | చాలా మంది ఇండ్లల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో బెల్లం కూడా ఒకటి. తీపి పదార్థాల తయారీలో, ఆయుర్వేద పానీయాల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలా మంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో దీని వాడకం ఎక్కువయ్యిందని చెప్పవచ్చు. బెల్లం వాడకం ఎక్కువవడం వల్ల బెల్లం కల్తీ సమస్య కూడా పెరుగుతోంది. బెల్లం తయారీలో చక్కెర పొడి, చాక్ పొడి, బేకింగ్ సోడా వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల బెల్లం మంచి రంగులో కనిపించడంతో పాటు మృదువుగా, బరువుగా ఉంటుంది.
టెస్టు ఇలా చేయాలి..
బేకింగ్ సోడా వంటి పదార్థాలు వెంటనే బయటకు కనిపించకపోయినా బెల్లం నాణ్యత, సహజ గుణాలు తగ్గిపోతాయి. ఇటువంటి కల్తీ బెల్లాన్ని వాడడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం ఉంటుంది. పోషక విలువలు తగ్గుతాయి. బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. అయితే ఒక చిన్న ఇంటి పరీక్షను ఉపయోగించి బెల్లం నాణ్యతను, బెల్లంలో బేకింగ్ సోడా ఉందా లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష చేయడానికి గాను ముందుగా కొద్దిగా బెల్లాన్ని తీసుకుని మెత్తగా చేయాలి. దాదాపు పావు టీ స్పూన్ బెల్లాన్ని ఒక చిన్న గ్లాస్ లో తీసుకోవాలి. తరువాత ఇందులో 3 ఎమ్ఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. తరువాత జరిగే ప్రతిచర్యను గమనించాలి. బుడగలు రాకపోతే బెల్లం స్వచ్చమైనది అని అర్థం. ఒకవేళ బుడగలు వస్తే బెల్లం కల్తీది అని అర్థం.
FSSAI లైసెన్స్ నంబర్ ముఖ్యం..
బెల్లంలో సోడియం బైకార్బోనేట్( బేకింగ్ సోడా) ఉంటే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కలిసి ప్రతిచర్యగా కార్బన్ డై యాక్సైడ్ ను విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ కారణంగా బుడగలు ఏర్పడతాయి. ఇది బెల్లం కల్తీని తెలియజేస్తుంది. ఈ చిన్న పరీక్ష ద్వారా బెల్లం నాణ్యతను తెలుసుకోవచ్చు. కల్తీ బెల్లాన్ని వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక బెల్లం కొనే ముందు కొన్ని సూచనలను పాటించాలి. బెల్లం ప్యాకెట్ పై FSSAI లైసెన్స్ నంబర్ ఉందో లేదో చూసుకోవాలి. చాలా ప్రకాశవంతంగా, మెరిసే బెల్లాన్ని కొనకూడదు. నమ్మకమైన బ్రాండ్స్ లేదా విక్రేతల ద్వారా వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొద్దిగా గోధుమరంగు లేదా గాఢ రంగు బెల్లం తీసుకోవడం మంచిది. అలాగే తక్కువ ధరకు లభిస్తుంది కదా అని బెల్లాన్ని కొనకూడదు. తక్కువ ధరకు లభించే బెల్లాన్ని జాగ్రత్తగా చూసి కొనాలి. ఇక బెల్లంలో కల్తీ ఉందని అనిపిస్తే FSSAI ఆన్లైన్ కంప్లైంట్ పోర్టల్ ద్వారా, FSSAI మొబైల్ యాప్ ద్వారా లేదా స్థానిక ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. కల్తీ ఉన్న బెల్లాన్ని కొనుగోలు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక బెల్లం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

