IND vs ENG : పొట్టి ప్రపంచకప్‌లో మరో బిగ్ ఫైట్‌కు వేళైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత్, ఇంగ్లండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఓటమి.. సూపర్ 8ను అజేయంగా ముగించిన ఇంగ్లండ్‌కు చెక్ పెట్టేందుకు టీమిండియా వ్యూహ రచన చేస్తోంది. ఇరుజట్లకు ఇది వరుసగా మూడో సెమీఫైనల్ కాగా.. చెరొక విజయంతో విశ్వవిజేతగా నిలిచాయి. ఈసారి పైచేయి సాధించి న్యూజిలాండ్‌ను ఢీ కొట్టేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ హిట్టర్లనే నమ్ముకున్న భారత్‌కు.. సమిష్టిగా అదరగొడుతున్న హ్యారీ బ్రూక్ సేన అడ్డుకుంటుందా?.. అనేది మారికాసేపట్లో తెలియనుంది.
లీగ్ దశ నుంచి ఓటమెరుగని దక్షిణాఫ్రికా తొలి సెమీఫైనల్లో అనూహ్య ఓటమి చవిచూసింది. గ్రూప్ బీ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణతో సెమీస్‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్ సంచలన ఆటతో సఫారీలను ఇంటికి పంపింది. ఫిన్ అలెన్(33 బంతుల్లోనే వంద) అజేయం సెంచరీతో ప్రొటీస్ జట్టు కల చెదిరింది. ఇప్పుడు గ్రూప్ ఏలోని భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
Here’s what happened the last time India and England met in a T20I at the Wankhede Stadium 😯#T20WorldCup #INDvENG pic.twitter.com/hpf0tY7zhu
— Cricbuzz (@cricbuzz) March 5, 2026
లీగ్ దశను అజేయంగా దాటిన టీమిండియా.. సూపర్ 8లో వరుసగా రెండు విజయాలతో సెమీస్ బెర్తు పట్టేసింది. మరోవైపు.. ఇంగ్లండ్ మాత్రం.. మూడుకు మూడు మ్యాచుల్లో గెలుపొందింది. టీమ్ ఫామ్ పరంగా ఆతిథ్య జట్టు కంటే.. ఇంగ్లండ్ కొంచెం బెటర్‌గా ఉంది. కానీ.. వాంఖడేలోని పరిస్థితులు బాగా తెలిసిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను ఫైనల్ చేర్చాలనే పట్టదులతో ఉన్నాడు. ఇరుజట్లకు సమాన అవకాశాలున్నందున గెలుపై ఇప్పుడే అంచనాకు రాలేం.
టీ20ల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు మెరుగైన రికార్డుంది. ఇరుజట్లు 29సార్లు ఎదురుపడగా.. టీమిండియా 17 విజయాలతో ఆధిపత్యం చెలాయించింది. 2022 పొట్టి ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జేసన్ రాయ్‌లు విధ్వంసక ఆటతో ఉఫ్మనిపించారు.
ఆ ఓటమికి 2024 ఎడిషన్‌లో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపులతో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ ఇంటిముఖం పట్టింది. మూడోసారి సెమీస్‌లో భారత్‌ను గెలిపించేది ఎవరు? ఇంగ్లండ్‌ను గట్టెక్కించేది ఎవరు? అనేది చూద్దాం.
డిఫెండింగ్ ఛాంపియన్ అన్న మాటేగానీ సూర్యకుమార్ సేన భారీ తేడాతో గెలుపొందిన మ్యాచ్ ఒక్కటీ లేదు. జింబాబ్వేపై 254 రికార్డు స్కోర్ కొట్టినా.. బౌలర్ల వైఫల్యంతో పరుగుల విజయమే దక్కింది. బ్యాటింగ్ యూనిట్లో ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును వేధిస్తోంది. పొట్టి ఫార్మాట్లో నంబర్ 1 బ్యాటరైన అభి.. పవర్ ప్లేలోనే డగౌట్ చేరుతున్నాడు. జింబాబ్వేపై అర్ధ శతకంతో ఫామ్ అందుకున్నాడనుకుంటే వెస్టిండీస్‌పై 10కే ఔటయ్యాడు. కుర్రాడు ఇషాన్ కిషన్ మెరుపులు రెండు మ్యాచ్‌లకే పరిమితమైన వేళ.. నేనున్నాగా అంటూ సంజూ శాంసన్ మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు.
A fascinating subplot in tonight’s semifinal: Sanju Samson vs Jofra Archer 🔥#INDvENG #T20WorldCup pic.twitter.com/JlXEhw2Uti
— Cricbuzz (@cricbuzz) March 5, 2026
ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్ బౌలర్లను వణికిస్తూ అజేయ అర్ధ శతకంతో జట్టును గెలిపించాడు సంజూ. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు రాణిస్తున్నా చివరిదాకా నిలవడం లేదు. ఇక ఫినిషర్ పాత్రకు దూబే సరైన న్యాయం చేయకపోవడం భారత్‌కు మైనస్ అవుతోంది. బౌలింగ్‌లో బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దారుణ వైఫల్యంతో ప్రత్యర్ధులు లాభపడుతున్నారు. ఇంగ్లండ్‌ను ఓడించాలంటే బ్యాటర్లు దంచేస్తే సరిపోదు.. బౌలర్లు కూడా వికెట్లు వేటతో చెలరేగాలి. ముఖ్యంగా.. మిడిల్, డెత్ ఓవర్లలో పరుగుల్ని కట్టడి చేయడం చాలా ముఖ్యం.
పదో సీజన్ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజయాల్లో కీలకం అవుతున్నది ముగ్గురే. ఒకరు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆల్‌రౌండర్ విల్ జాక్స్, స్పిన్నర్ ఆదిల్ రషీద్. సెమీ ఫైనల్లోనూ భారత్‌కు ఈ ముగ్గురి నుంచే ముప్పు ఎదురవ్వనుంది. సూపర్ 8లో పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగిన బ్రూక్.. టీమిండియాపై దంచేందుకు రెఢీగా ఉన్నాడు. టాపార్డర్‌లో జాకప్ బెథెల్ రాణిస్తున్నా.. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ వైఫల్యం భారత్‌కు ప్లస్ కానుంది.
A DEMON AT THE DEATH 😈
‘Will’ Jacks make an impact again tonight? 😉#T20WorldCup #INDvENG pic.twitter.com/vQNt7xTqxo
— Cricbuzz (@cricbuzz) March 5, 2026
కానీ, ఐపీఎల్లో రికార్డు సెంచరీలున్న బట్లర్, సనామీలా ముంచెత్తే సాల్ట్ వాంఖడేలో ఫామ్ అందుకుంటే ఇంగ్లండ్‌ను అడ్డుకోవడం కష్టమే. సో.. వీరిద్దరిని పవర్ ప్లేలోనే డగౌట్ చేర్చడం ముఖ్యం. జాకబ్ బెథెల్ ఫర్వాలేదనిపిస్తున్నా.. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ నుంచే భారత టగాళ్లకు ముప్పు పొంచి ఉంది. ఈ సీజన్లో వికెట్లతో జాక్స్ ఇంగ్లండ్ ట్రంప్ కార్డులా మారాడు. లెఫ్ట్ హ్యాండర్లను ఔట్ చేయడంలో రికార్డున్న రషీద్ కూడా డేంజరే.
India have a good record against Adil Rashid, but can he trouble their left-handers at the Wankhede Stadium tonight?
▶️ https://t.co/XMTmkCdrgg pic.twitter.com/x5bajK4BWb
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2026