భోపాల్: రోడ్డుపై ఉన్న ఒక వృద్ధుడిపై ఎద్దు దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి పడేసింది. కిందపడిన ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Stray Bull Attacks Old Man) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల లాల్జీ పట్కర్ తన ఇంటి వద్ద ఉన్న రోడ్డుపై నిల్చొని ఉన్నాడు. ఆయన సమీపంలో రెండు ఎద్దులు ఉన్నాయి.
కాగా, నల్ల ఎద్దు ఉన్నట్టుండి ఆ వృద్ధుడి మీదకు దూసుకొచ్చింది. వెనుక నుంచి కొమ్ములతో ఆయనను ఎత్తి పడేసింది. ఆ ఎద్దు ఒకసారి మాత్రమే దాడి చేసింది. అయినప్పటికీ ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిందపడిన ఆయన పైకి లేవలేకపోయాడు.
మరోవైపు గమనించిన స్థానికులు ఆ వృద్ధుడిని పైకి లేపి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్లర్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | CCTV Footage: Stray Bull Att*cks 60-Year-Old Man In #Chhatarpur, Victim Critical#MadhyaPradesh #MPNews pic.twitter.com/VJuIpGiOGM
— Free Press Madhya Pradesh (@FreePressMP) January 27, 2026
Also Read:
Doctor Rides Excavator To Hospital | జేసీబీలో ఆసుపత్రికి చేరుకున్న డాక్టర్.. ఎందుకంటే?
Air India Flight | తప్పిన ముప్పు.. రన్ వే టచ్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ రద్దు
Ramdas Athawale | అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే