జైపూర్: ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. రన్ వే టచ్ చేసిన తర్వాత పైలట్లు చివరి నిమిషంలో ల్యాండింగ్ రద్దు చేశారు. గాలిలో ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ విమానం ల్యాండ్ అయ్యింది. (Air India Flight) ఈ సంఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఎయిర్ ఇండియా విమానం ఏఐ1719 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉన్నది.
కాగా, ఎయిర్ ఇండియా విమానం రన్‌వే తాకిన చివరి క్షణంలో ల్యాండింగ్‌ను పైలట్లు విరమించారు. ఆ విమానాన్ని వెంటనే తిరిగి గాల్లోకి లేపారు. ‘గో-అరౌండ్’ పద్ధతిని పాటించారు. దీంతో ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ ఆ విమానం ఒక రౌండ్ తిరిగింది. పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో రెండో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్చార్జ్, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రాంధావాతో సహా 135 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. తొలిసారి రన్ వే టచ్ తర్వాత ల్యాండింగ్ విఫలం కావడంతో వారంతా భయాందోళన చెందారు. అయితే రెండో ప్రయత్నంలో ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఊరట చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై వివరాలు సేకరిస్తున్నది.
Also Read:
Ramdas Athawale | అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
Eknath Shinde on Ajit Pawar | కపటం లేని, భయంలేని నేత అజిత్ పవార్: ఏక్నాథ్ షిండే
Stealing Software Data | రూ.87 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ డేటా చోరీ.. మాజీ టెకీపై కేసు