ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ (Ramdas Athawale) చేశారు. ఆయన మరణం మహారాష్ట్రకు తీరని లోటని అన్నారు. ‘ఇవాళ మహారాష్ట్ర ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. మహాయుతి కూటమిలో ఆయన సభ్యుడు. మహారాష్ట్ర కోసం చాలా చేశారు. ఇది మాకు తీరని లోటు. మేం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం’ అని అన్నారు. ‘ఈ సంఘటన మాకు మంచిది కాదు. కాబట్టి దర్యాప్తు జరుపాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది’ అని తెలిపారు.
కాగా, బారామతి జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ముంబై నుంచి చార్టెడ్ విమానంలో అజిత్ పవార్ బయలుదేరారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఆ విమానం కూలిపోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఇద్దరు పైలట్లు, ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.
Also Read:
Eknath Shinde on Ajit Pawar | కపటం లేని, భయంలేని నేత అజిత్ పవార్: ఏక్నాథ్ షిండే
Couple Jump From Pizza Shop | పిజ్జా షాపులో జంట.. హిందూ సంస్థ సభ్యులు రావడంతో ఏం చేశారంటే?
Watch: వరుడికి రసగుల్లా తినిపించేందుకు తల్లి యత్నం.. వధువు ఏం చేసిందంటే?