హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.
వారిద్దరితో పాటు ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల వాదనల నిమిత్తం విచారణ ఈనెల 10వతేదీకి వాయిదా పడింది.