చిన్నారులకు సామూహిక అన్నప్రాసన
తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని, స్థానిక సర్పంచ్ వాడకొప్పుల ఉమ హాజరై 6 నెలలు నిండిన చిన్నారులకు...
అనంతగిరి, ఆగస్టు 04 : తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని, స్థానిక సర్పంచ్ వాడకొప్పుల ఉమ హాజరై 6 నెలలు నిండిన చిన్నారులకు తొలిసారి అన్నం తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన పిల్లల కోసం తల్లిపాలతో పాటు 6 నెలల తర్వాత తప్పనిసరిగా అనుబంధ ఆహారం ప్రారంభించాలన్నారు. పిల్లలు పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలే ఉత్తమమైన ఆహారమని పిల్లలకు రెండు సంవత్సరాల వరకు పాలు ఇవ్వవచ్చని చెప్పారు. చిన్నారుల బరువు, ఎత్తు నమోదు చేసి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, తల్లులకు అందిస్తున్న సేవలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి, ఆశా వర్కర్లు, ఆయాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

