ఢిల్లీ : స్వదేశంలో ఈనెల 27 నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునే గాక దేశవాళీల్లోనూ అదరగొట్టిన పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌తో పాటు జమ్ము కాశ్మీర్ పేసర్ మహ్మద్ నబీకి వన్డే జట్టులో తొలిసారి చోటు దక్కింది. గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యుల్లో సీనియర్ క్రికెటర్ రవీంద్ర జడేజా వన్డే టీమ్‌లోకి పునరాగమనం చేయగా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను ఆసియా క్రీడల నుంచి తప్పించి వన్డే జట్టులో చేర్చారు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీ20 టీమ్ విషయానికొస్తే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్‌లోని యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ స్థానాల్లో మయాంక్, ప్రిన్స్ చోటు దక్కించుకోవడం మినహా మార్పులేమీ లేవు. కాగా గాయంతో ఆసియా క్రీడలకు దూరమైన వరుణ్ చక్రవర్తి స్థానాన్ని బోర్డు విప్రాజ్తో భర్తీ చేసింది.
వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, రుతురాజ్, రాహుల్, జురెల్, నితీశ్, జడేజా, కుల్దీప్, ప్రసిద్ధ్, బ్రార్, సిరాజ్, నబీ, జైస్వాల్, నమన్.
టీ20 జట్టు: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, సూర్యవంశీ, ఇషాన్, శాంసన్, తిలక్, దూబే, కుల్దీప్, అక్షర్, సుందర్, బిష్ణోయ్, నితీశ్ రెడ్డి, అర్ష్‌దీప్, ప్రిన్స్, మయాంక్ యాదవ్.