న్యూఢిల్లీ : బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌పై తిరుగులేని విజయాలతో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న భారత్ ఆ జట్టుతో మూడో పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చేయడంతో పాటు బెంచ్ ఆటగాళ్లకు పరీక్షించాలని భావిస్తోంది. దాంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది.
తొలి రెండు టీ20ల్లో మెరిసిన ఓపెనర్లు అభిషేక్, శాంసన్, ఇషాన్లో ఒకరికి రెస్ట్ ఇచ్చి సూర్యవంశీని దింపే చాన్సుంది. ఆసియా గేమ్స్‌కు ముందు రిజర్వ్ ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకు ఈ పోరును సద్వినియోగం చేసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. మరోవైపు మంచి మ్యాచ్ విన్నర్లతో కూడిన అఫ్గానిస్థాన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరుస్తోంది. భారత్‌తో గత 10 టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు రుచి చూడలేకపోయిన అఫ్గాన్ ఆసియా గేమ్స్‌కు ముంగిట మెరుగైన ఈ పోరులో అయినా ప్రదర్శన ఆశిస్తోంది.