బీఆర్ఎస్లో భారీగా చేరికలు
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీపై విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.
– బడంగ్పేట్, సెప్టెంబర్ 16
కాంగ్రెస్ సర్కార్ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడంతో ఆ పార్టీ నాయకులు గులాబీ గూటికి వస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. పాత కొత్త అనే భావన లేకుండా పార్టీ పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తుమ్మలూరు వార్డు సభ్యులు జెనిగ శివ కుమార్, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి, గోడు కొండ్ల పర్వతాలు యాదవ్, మాజీ వార్డు సభ్యులు ఏనుగుల రాములు, మాజీ సొసైటీ డైరెక్టర్ మద్ది శ్రీధర్ రెడ్డి, శేఖర్ గౌడ్, అంజయ్య, లక్ష్మారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, సంపంగి రాజు, కొండల్ యాదవ్, ముక్కర వెంకటేష్, శివ, శ్రీశైలం యాదవ్ వీరితో పాటు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- Congress
- Maheshwaram
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

