ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్‌బాల్
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తరచూ తన ప్రసంగాల్లో బీద అరుపులు అరిచే సీఎం రేవంత్‌రెడ్డి తన సరదా కోసం కోట్లు వెచ్చిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- సరదా కోసందుబారా
- 5.5 కోట్లతో సొంతానికి ఫుట్‌బాల్ గ్రౌండ్
- ఎంసీహెచ్చార్డీలో పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం
- రూ.1.5 కోట్లతో ప్రీమియం హెలిప్యాడ్ కూడా!
- తనను కోసినా రూపాయిలేదన్న సీఎం వ్యాఖ్యల్ని
- గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శల వెల్లువ
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తరచూ తన ప్రసంగాల్లో బీద అరుపులు అరిచే సీఎం రేవంత్‌రెడ్డి తన సరదా కోసం కోట్లు వెచ్చిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూనే ఎంసీహెచ్ఆర్డీలో తన సరదా కోసం రూ.5.5 కోట్ల వ్యయంతో ఫుట్‌బాల్ స్టేడియం, కోటిన్నరతో హెలిప్యాడ్ నిర్మాణానికి మొత్తం రూ.7 కోట్లు ఖర్చు చేయడంపై పౌర సమాజం మండిపడుతున్నది. గతంలో మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు, అందాల పోటీల పేరిట మరో రూ.100 కోట్లు దుబారా చేసిన రేవంత్ సర్కారు తాజాగా చేపట్టిన ఈ హెలిప్యాడ్, ఫుట్‌బాల్ గ్రౌండ్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పాలన చేపట్టిన తొలి నాళల్లో హంగులు, ఆర్భాటాలకు తాము దూరంగా ఉంటామని, తమది ప్రజాప్రభుత్వం అని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి తీరు చూసి సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.
‘రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, రైతులకు రుణమాఫీ, ఒంటరి మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు నెలకు రూ.6 వేలు పింఛన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆడబిడ్డల పెండ్లిలకు తులం బంగారం, స్కూటీలకు పైసల్లేవ్ కానీ.. మీ సరదాలకు డబ్బులు ఉన్నాయా..?’ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ‘ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకెవరు ఇచ్చారు..?’ అంటూ సీఎంను ప్రశ్నిస్తున్నారు. ‘ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులతో వ్యక్తిగత సరదాలు తీర్చుకోవడం ఏంటీ..?’ అని మండిపడుతున్నారు. ‘ప్రజలకు సేవ చేసేందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సీఎం సీటులో కూర్చొబెట్టారని, లావిష్‌గా లైఫ్ ఎంజాయ్‌గా చేయడానికి కాదు..’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ‘రాష్ట్రంలో ఓ వైపు నాణ్యమైన విద్య, వైద్యం, కనీస మౌలిక వసతులు, రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మీ ప్రాధాన్య అంశాలు ఇవ్వేనా..?’ అని ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

