హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఐ) జాతీయ అర్హత టోర్నమెంట్ బుధవారం హైదరాబాద్‌లోని నాసర్ పోలో-ఈక్వెస్ట్రియన్ అకాడమీలో మొదలైంది. ఈ మెగా ఈవెంట్లో దేశ వ్యాప్తంగా 11 హార్స్ రైడింగ్ క్లబ్‌లు, అకాడమీలకు చెందిన 50 రైడర్లు పాల్గొంటున్నారు.
ఈ నెల 20 వరకు జరిగే పోటీల్లో ఈ పోటీల్లో గెలిచిన రైడర్లు ఈఎఫ్ఐ జూనియర్ నేషనల్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తారని ఆతిథ్య నాసర్ పోలో అకాడమీ సీఈవో హఫీజుద్దీన్ తెలిపారు.