అబిడ్స్, సెప్టెంబర్ 16 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్ఓలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం పిలిచినప్పుడు గుర్తు తెలియని దుండగులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాడి చేయడం హేయమైన చర్య అని నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, రెడ్‌హిల్స్ మహిళా మండలి అధ్యక్షురాలు ఏకుల అనిత బుధవారం పత్రికా ప్రకటనలో విమర్శించారు.
మాస్క్‌లు ధరించి పోలీస్ స్టేషన్లో చొరబడ్డారంటే ప్రభుత్వ ప్రోత్సాహం, పోలీసుల సహకారం ఉండొచ్చని అనుమానించాల్సి వస్తోందన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఏకుల అనిత హెచ్చరించారు.