న్యూఢిల్లీ: పెళ్లి వేడుక తర్వాత వరుడికి రసగుల్లా తినిపించేందుకు అతడి తల్లి ప్రయత్నించింది. అయితే చెంచా నుంచి అది జారిపోయింది. పక్కనే ఉన్న వధువు వెంటనే అలెర్ట్ అయ్యింది. క్షణకాలంలో ఆ రసగుల్లాను చేతిలో పట్టుకున్నది. (Bride’s split-second rasgulla catch) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక జంటకు పెళ్లి జరిగింది. ఇంటికి చేరుకున్న వధూవరులకు రసగుల్లా తినిపించేందుకు వరుడి తల్లి సిద్ధమైంది. తొలుత కుమారుడికి రసగుల్లా తినిపించేందుకు ప్రయత్నించింది.
కాగా, స్ఫూన్‌లో ఉన్న రసగుల్లా వరుడి నోటికి చేరేంతలో జారిపడింది. అయితే అతడి పక్కనే ఉన్న వధువు వెంటనే స్పందించింది. క్షణకాలంలో ఠక్కున ఆ రసగుల్లాను చేతిలో పట్టుకున్నది. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వధువు రియాక్షన్‌ను నెటిజన్లు అభినందించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ స్కిల్‌తో ఆమెను పోల్చారు. రసగుల్లా కావాలని భావించిన ఆ వధువు దానిపై దృష్టిసారించడంతో ఠక్కున పట్టుకున్నదని ఒకరు చమత్కరించారు. అమ్మాయిలు దేనిపైనైనా ఒక కన్నేసి ఉంచుతారని మరొకరు కామెంట్ చేశారు. తృటిలో ఆమె స్పందించిన తీరు, సమయస్ఫూర్తిని పలువురు మెచ్చుకున్నారు.
Also Read:
Couple Jump From Pizza Shop | పిజ్జా షాపులో జంట.. హిందూ సంస్థ సభ్యులు రావడంతో ఏం చేశారంటే?
Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
Professor Stabbed At Station | రైల్వే స్టేషన్లో.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు