ముంబై: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎస్పీపీ అధినేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సంతాపం తెలిపారు. ఆయన కపటం లేని, భయంలేని నిజాయితీ గల నాయకుడని అన్నారు. (Eknath Shinde on Ajit Pawar) బుధవారం మీడియాతో ఏక్నాథ్ షిండే మాట్లాడారు. అజిత్ పవార్ అకాల మృతికి సంతాపం తెలిపారు. ‘నిబద్ధత, పరిపాలనపై బలమైన పట్టు ఉన్న నిజాయితీ గల నాయకుడు’ అని అభివర్ణించారు. ‘ఇది మహారాష్ట్రకు ఒక దురదృష్టకరమైన రోజు. మాకు, యావత్ మహారాష్ట్రకు ఇది ఒక బాధాకరమైన సంఘటన’ అని అన్నారు.
కాగా, పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే ప్రతి అంశాన్ని అజిత్ పవార్ అధ్యయనం చేస్తారని ఏక్నాథ్ షిండే తెలిపారు. ‘నేను ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లో ఆయనతో కలిసి పనిచేశా. ఆయన నిజాయితీపరుడు, నిర్భయమైన నేత. నేను దీనిని స్వయంగా చూశా’ అని అన్నారు. అజిత్ పవార్ వ్యక్తిత్వాన్ని ఏక్నాథ్ షిండే ప్రశంసించారు. అజిత్ దాదా మాట మీద నిలబడే వ్యక్తి అని కొనియాడారు. ఆయనతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి చార్టెడ్ విమానంలో అజిత్ పవార్ బయలుదేరారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఆ విమానం కూలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఇద్దరు పైలట్లు, ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.
#WATCH | Thane | On the passing away of his colleague Ajit Pawar, Maharashtra Dy CM Eknath Shinde says,” It is an unfortunate day for Maharashtra. This is a painful incident for su and whole of Maharashtra. Ajit Dada was a man of his word. We worked as a team when I was the CM,… pic.twitter.com/MLEiAHgnGH
— ANI (@ANI) January 28, 2026
Also Read:
Watch: వరుడికి రసగుల్లా తినిపించేందుకు తల్లి యత్నం.. వధువు ఏం చేసిందంటే?