న్యూఢిల్లీ : ఢిల్లీలో నివసిస్తున్న ఈశాన్య రాష్ర్టాల ప్రజల భద్రతపై అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజలపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ప్రకటిస్తూ ఈశాన్య ప్రాంత ప్రజల కోసం ఓ ప్రత్యేక చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాగా, గావ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీనే కేంద్రంలోను, ఢిల్లీలోను అధికారంలో ఉండడం గమనార్హం.