KTR | నీ సూసైడ్ నోట్ ఆధారంగానే కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం.. వేణుతో ఫోన్లో కేటీఆర్.. వీడియో
KTR | జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని, నోటిఫికేషన్ల కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని వేణు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆవేదన పంచుకున్నాడు.
KTR | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి వేణు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసిందే. ఈ మేరకు వేణును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన వేణుని ఆసుపత్రిలో పరామర్శించి కేటీఆర్ చేత ఫోన్ మాట్లాడించగా.. వేణుకు ధైర్యం చెప్పిన కేటీఆర్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని, నోటిఫికేషన్ల కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని వేణు కేటీఆర్‌తో ఆవేదన పంచుకున్నాడు. మా అమ్మ మానసిక వికలాంగురాలు.. తనకు సొంత ఇల్లు లేనప్పటికీ కక్ష పూరితంగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నాడు. మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ అని ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడటం జరిగింది. దాని ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాని ఆధారంగానే న్యాయం చేస్తామని కేటీఆర్ వేణుకు భరోసానిచ్చారు.
బతికి ఉండి పోరాడాలి.. చచ్చి సాధించేది ఏం లేదని కేటీఆర్ వేణును వారించారు. ఈ కాంగ్రెస్ వాళ్లు బతకనివ్వడం లేదు.. ఈ రోజంటే మీరు మాట్లాడారు.. సార్ ఇన్నిరోజులు నాకెలాంటి ధైర్యం లేదు. ఎటువంటి అవకాశం లేదు. ఎవరితో మాట్లాడుదామన్న భయమేస్తుంది. అసలు కాంగ్రెస్‌లో పై స్థాయిలో ఉన్న నాయకులు ఏమో కానీ.. కింది స్థాయి నాయకులు రెచ్చిపోయే విధానం ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్లే కలెక్టర్లన్నట్టు ఫీలవుతున్నారని ఫైర్ అయ్యాడు వేణు. రేపు మనం ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తాం. రాగానే మీ నోట్ ఆధారం చేసుకుని రేపు నిరుద్యోగ యువతకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని
ఆత్మహత్యయత్నం చేసిన నిరుద్యోగి వేణును ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్ఫోన్ ద్వారా నిరుద్యోగ యువకుడు వేణును పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్
ఆత్మహత్యయత్నం చేసిన వేణుని… https://t.co/Pe4CFgEv6t pic.twitter.com/xG4gz65has
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026
Read ALso :
Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ
Gandhari | రామలక్ష్మణపల్లిలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన వరి నాటు.. తీవ్ర నష్టంలో రైతులు
Odela | ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

