Odela | ఓదెల, ఆగస్టు 4 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీల ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. కొలనూర్, నాంసానిపల్లి, గోపరపల్లి, హరిపురం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను బాలింతలకు తెలియజేశారు. పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలనే తాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిపాలు శ్రేష్టమని తెలిపారు. పిల్లలకు అక్షర అభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను చేశారు. ఆయా గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సర్పంచులు పల్లె కనకయ్య, గంగిశెట్టి ప్రభాకర్, గారవేణి విజయ-నాగరాజు యాదవ్, మద్యవేని రవి యాదవ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, ఉప సర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, బొంగాని రాజయ్య గౌడ్, పాకాల కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, స్వశక్తి మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.