రుద్రంపూర్, అక్టోబర్ 03 : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న స్పెషల్ క్యాంపెయిన్–6లో భాగంగా ఏరియా వర్క్‌షాప్‌లో శుక్రవారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. వర్క్‌షాప్ హెచ్ఓడీ, డీజీఎం జే. క్రిస్టఫర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులు, అప్రెంటిసులు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సమర్థవంతంగా సేకరించి, తడి–పొడి చెత్తను వేరు చేయడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల మానవ ఆరోగ్యానికి హాని కలగకుండా, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతోపాటు పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛ, ఆరోగ్యకర భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా శ్రమించాలన్నారు. సంవత్సరానికి 100 గంటలు, ప్రతిరోజూ కొంత సమయం శ్రమదానం కోసం కేటాయిస్తే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులు, అప్రెంటిసులు వీధి వీధికి.. గ్రామ గ్రామానికి స్వచ్ఛతను విస్తరింపజేస్తూ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్‌షాప్ ఇంజినీర్లు బి. శంకర్, టీ. అనిల్, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎండీ సత్తార్ పాషా, సూపర్వైజర్లు యు.రమేష్‌బాబు, తారాచంద్, ఎస్డీ యాకూబుద్దీన్, మెంగని అశోక్, కరుణాకర్‌తో పాటు వర్క్‌షాప్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఆల్‌ట్రేడ్ అప్రెంటిసులు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.