Noida | పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సూపర్నోవా కాంప్లెక్స్‌లోని 43వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంతస్తు నోయిడాలోని సెక్టార్ 94లో ఉన్న సూపర్నోవా కాంప్లెక్స్‌లోని స్పైరా టవర్‌లో ఉంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని మానెసర్ (Haryana)కు చెందిన సంభవ్ జైన్‌గా గుర్తించారు. అతడు ఆ ఎత్తైన బిల్డింగ్‌లోని రూమ్ Airbnbను ఆన్లైన్లో బుక్ చేసుకుని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఒంటరిగా బస చేశారు.
ఘటనకు ముందు ఏసీ రిపేర్ (AC Repair) చేసే టీమ్ ఆ అంతస్తులోనే పనిచేస్తున్నారు. రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించిన సంభవ్‌ను వారు రక్షించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతడు బిల్డింగ్ బయట అంచున నిలబడి ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. సెక్యూరిటీ గార్డులకు ఈ విషయం చెప్పి అలారం మోగించారు. సంభవ్ జైన్ ఆత్మహత్య చేసుకోవడానికే బాల్కనీలో నిలబడ్డారు అని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
అతడు ఆర్థిక ఇబ్బందుల్ల మానసిక ఒత్తిడి (Mental Stress)లో ఉన్నట్లు, ఘటనకు ముదు నాలుగు రోజుల నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయాడని, ఆత్మహత్యకు ముందు అతడు తన తండ్రికి పలుమార్లు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు. లోతుగా విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. 2023, జనవరిలో ఈ ఎత్తైన భవనంలోని 43వ అంతస్తు నుంచే ఢిల్లీకి చెందిన 43 ఏండ్ల ప్రాపర్టీ కన్సల్టెంట్, గతేడాది ఆగస్టులో 23 ఏండ్ల లా స్టూడెంట్ 32వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Supernova Spira