శ్రీనగర్: అత్యంత కఠినమైన ప్రకృతి సవాళ్లను ఒక డాక్టర్ అధిగమించారు. గర్భిణీలకు కాన్పులు, సర్జరీల కోసం దట్టంగా పరుచుకున్న మంచును లెక్కచేయలేదు. జేసీబీలో ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలందించారు. (Doctor Rides Excavator To Hospital) జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుల్వామాకు చెందిన డాక్టర్ బషారత్ పండిత్, శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. షోపియన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.
కాగా, మంగళవారం ఉదయం 7.30 గంటలకు శ్రీనగర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోపియన్‌లోని ఆసుపత్రికి డాక్టర్ బషారత్ తన కారులో బయలుదేరారు. శ్రీనగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచు తక్కువగా ఉన్నది. అయితే షోపియన్‌లో మూడు నుంచి నాలుగు అడుగుల వరకు మంచు కురిసింది. దీంతో అక్కడకు చేరుకున్న తర్వాత డాక్టర్ ప్రయాణించిన కారు మంచులో కూరుకుపోయింది.
మరోవైపు డాక్టర్ బషారత్ పండిత్ తన కారును అక్కడ వదిలేశారు. ఆసుపత్రికి చేరుకోవడానికి సుమారు మూడు కిలోమీటర్లు ఆయన నడవాల్సి ఉంది. కొంత దూరం నడవగా అటుగా ఒక జేసీబీ వెళ్తున్నది. దీంతో ఆయన అందులోకి ఎక్కారు. జేసీబీ సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. గర్భిణీలకు వైద్య సేవలందించారు. తన విభాగం పది శస్త్రచికిత్సలు చేసిందని, రోగులంతా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ బషారత్ పండిత్ తెలిపారు. వైద్యవృత్తి పట్ల ఆయన అంకిత భావాన్ని రోగులు, స్థానికులు ప్రశంసించారు.
#GKShorts | Shopian Doctor Reaches Hospital on Excavator Amid Heavy Snowfall, Wins Praise #Shopian #Doctor #Snowfall pic.twitter.com/xugJrFdFBJ
— Greater Kashmir (@GreaterKashmir) January 28, 2026
Also Read:
Air India Flight | తప్పిన ముప్పు.. రన్ వే టచ్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ రద్దు
Ramdas Athawale | అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
Eknath Shinde on Ajit Pawar | కపటం లేని, భయంలేని నేత అజిత్ పవార్: ఏక్నాథ్ షిండే
Stealing Software Data | రూ.87 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ డేటా చోరీ.. మాజీ టెకీపై కేసు