IPL 2026 : పొట్టి ప్రపంచకప్ ముగియడంతో ఐపీఎల్(IPL) పండుగ కోసం క్రీడాభిమానులు ఎదురు చూస్తున్నారు. మార్చి 28 నుంచి మొదలయ్యే పంతొమ్మిదో సీజన్ దశల వారీగా జరగునుంది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ(BCCI) ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) బిగ్ హింట్ ఇచ్చాడు. షెడ్యూల్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ వచ్చే రెండు మూడు రోజుల్లోనే తొలి దశ షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కు మరో 18 రోజులే ఉంది. రెండు దశల్లో జరిగే ఈ మెగా టోర్నీ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దాంతో.. తొలి దశ షెడ్యూల్‌పై మంగళవారం బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టతనిచ్చాడు. మార్చి 12న లేదా 13వ తేదీన షెడ్యూల్ విడుదల కానుందని ఆయన చెప్పాడు. ‘ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్‌ను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయాలని అనకుంటున్నాం’ అని క్రిక్ బజ్‌తో సైకియా తెలిపాడు.
🚨 BREAKING: IPL 2026 Schedule expected on March 12! 🚨
“We are hoping to release the IPL schedule in a day or two,” BCCI secretary Devajit Saikia confirmed to Cricbuzz pic.twitter.com/65cuYWSEAj
— Cricbuzz (@cricbuzz) March 10, 2026
‘ఐపీఎల్‌ను రెండు దశలుగా నిర్వహించాలనుకుంటున్నాం. త్వరలోనే తొలి దశ షెడ్యూల్ ప్రకటిస్తాం. మొదటి 20 రోజుల మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ అందులో ఉంటుంది. మార్చి 12న లేదంటే 13వ తేదీన.. ఈ రెండు తేదీల్లో కచ్చితంగా షెడ్యూల్ విడుదల చేస్తాం. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఖరారు చేసిన తర్వాత రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటిస్తాం’ అని బీసీసీఐ సెక్రటరీ వెల్లడించాడు.
🚨 IPL SCHEDULE UPDATE 🚨
• 🇮🇳 Although the schedule for the IPL was supposed to be released today, the BCCI could not publish it today because it is being rescheduled. The BCCI has informed that the schedule will be released very soon…..Seemore pic.twitter.com/NsB7PaB8Rd
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 9, 2026
త్వరలోనే తమిళనాడు, అస్సాం, బెంగాల్, కేరళమ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో.. ఎన్నికల షెడ్యూల్ ఖరారయ్యాక ఐపీఎల్ షెడ్యూల్ విడులకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే రెండు దశలుగా టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించాయి. మరో విషయం.. పశ్చిమాసియా దేశాల్లోని యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికలు మినహా, మిగతావేవీ బీసీసీఐపై ప్రభావం చూపడం లేదని సైకియా అన్నాడు. పంతొమ్మిదో సీజన్‌ను మే 31వ తేదీలోపే ముగిస్తామని ఆయన పేర్కొన్నాడు.