KTR | తెలంగాణలోనే ఎన్నో సందర్భాల్లో వార్తను వార్తలా రాయలేని పరిస్థితి లేదా..? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది.. కేంద్ర మంత్రి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడని ఆ అమ్మాయి తల్లీదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే వారం రోజులు ఏ మీడియా రిపోర్ట్ చేసింది..? సోషల్ మీడియానే లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సెమినార్లో ‘రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ’ అంశంపై కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది.. నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరూ ఏం అనుకోవద్దు.. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్టుగా శాసనసభలో, బయట ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ఏ మీడియా ప్రశ్నించింది.. ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కదం తొక్కే దాకా ఏ మీడియా రాసింది..?ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం.. ఉందా..? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్లీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా.. ఉన్నదా రాసే పరిస్థితి.. చెప్పే పరిస్థితి ఉన్నదా..? అందరి ముందటే అడుగుతున్నా స్వేచ్చగా, నిర్బీతిగా పరిశోధనాత్మక కథనాలు వస్తున్నాయా..? వాస్తవాలు చెబితే నచ్చవన్నారు.
వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి.
మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి.
తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు.
సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే… pic.twitter.com/0gbjWVQHwT
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026