Murder Plan | ఓ వివాహిత ప్రియుడిపై మోజుతో భర్త, పిల్లలను వదిలేసి వేరే కాపురం పెట్టింది.. అయితే సదరు మహిళ అంతటితో ఆగకుండా తనకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలనుకొని స్కెచ్ వేసి.. ఆ తర్వాత మనసు మార్చుకొని పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్(22) రాంగ్ కాల్ ద్వారా శోభకు పరిచయమయ్యాడు. బాలాజీ నాయక్, శోభ మధ్య మొదలైన స్నేహం కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ ద్వారా పెరిగి ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తెలిసి భర్త రోజూ కొడుతున్నాడని శోభ మొదట అతన్ని హత్య చేసి, ఆ తర్వాత ప్రియుడు బాలాజీ నాయక్‌ను పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసింది.
అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న శోభ నెల రోజుల క్రితం పారిపోయి కుప్పంలోని ఓ గుడిలో బాలాజీ నాయక్‌ను పెళ్లి చేసుకుంది. తన భార్య శోభ కనిపించడం లేదని ఆమె భర్త చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో భర్త చిరంజీవి తరపు బంధువులు శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శోభ తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, ఆమె బలవంతంతో పెళ్లి చేసుకున్నానని ప్రియుడు బాలాజీ నాయక్ చెప్పడం.. మరోవైపు
తన భర్త రోజూ అనుమానంతో వేధించి కొట్టేవాడని ఆ దెబ్బలు చూసి బాలాజీ నాయక్ తన భర్తను చంపుతానంటే వద్దని పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నానని శోభ చెబుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రియుడిపై మోజుతో భర్త, పిల్లలను వదిలేసి వేరే కాపురం పెట్టిన వివాహిత
మొదట భర్తను చంపాలనుకొని స్కెచ్ వేసి.. తర్వాత మనసు మార్చుకొని పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న వివాహిత
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల… pic.twitter.com/C0QF4uspGx
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026