న్యూయార్క్: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్(Fifa,ఫిఫా) కీలక నిర్ణయం తీసుకున్నది. ఫిఫాలో వాటాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మాలన్న నిర్ణయాన్ని రద్దు చేసినట్లు అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటినో తెలిపారు. సుమారు 20 శాతం వాటాలను అమ్మి దాదాపు 402 కోట్ల డాలర్లను ఆర్జించాలని ఫిఫా భావించింది. కానీ ప్రణాళికకు ఫుట్‌బాల్ సమాఖ్యల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫిఫాలోని సభ్య దేశాలు ప్రైవేటు పెట్టుబడులను వ్యతిరేకించాయి. ప్రపంచకప్‌తో పాటు పలు రకాల ఈవెంట్లను ఫిఫా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వ్యతిరేకత ఎక్కువ కావడం వల్ల వివాదాస్పద ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు గియాన్ని ఇన్ఫాంటినో తెలిపారు.
తాము అనుకున్న ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయలు వచ్చాయని, దీంతో విభజన ఏర్పడిందని, తమ లక్ష్యాలు నెరవేరడం లేదు కాబట్టి, ఆ పెట్టుబడి ప్లాన్‌ను రద్దు చేసినట్లు ఫిఫా అధ్యక్షుడు చెప్పారు. ఫిఫాలో మొత్తం 211 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు ఓకే చెబితే ఆయా దేశాలకు 40 మిలియన్ల డాలర్లు ఇస్తామని ఇన్ఫాంటినో ఆఫర్ చేశారు. మహిళల, పురుషుల ప్రపంచకపల్లో ప్రైవేటు ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేశారు. కానీ యురోపియన్ ఫుట్‌బాల్ సంఘం యూఈఎఫ్ఏ ఆ ప్లాన్‌ను వ్యతిరేకించింది. ఒకవేళ ఆ ప్రణాళిక అమలు చేస్తే తాము వరల్డ్‌కప్‌ను నిషేధిస్తామని అన్నారు.