Murder Plan | వ్యాపారిపై హత్యాయత్నం.. భాగస్వామితో పాటు మరో ఆరుగురి అరెస్ట్
Murder Plan | కోట్ల రూపాయాల అప్పు ఎగ్గొట్టేందుకు, కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు కంపెనీ చైర్మన్‌ను హత్య చేయాలనుకున్నాడు. కథ అడ్డం తిరిగి కటకటాలపాలయ్యాడు.
Murder Plan | మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త, జీఎస్ఎమ్ ఫాయిల్స్ (GSM Foils) కంపెనీ ఎండీ మోహన్‌సింగ్ పర్మార్ (46)పై కాల్పుల జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సాగర్ గిరీష్ భానుశాలి (33), అతడికి సహకరించినవారిని అరెస్ట్ చేశారు. సాగర్ గిరీష్ భానుశాలి పర్మార్ కంపెనీలోని తోటి భాగస్వామి అని తెలిసి పోలీసులు ఖంగు తిన్నారు.
స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయిన సాగర్ గిరీష్ పర్మార్ నుంచి రూ. 32 కోట్లు తీసుకున్నాడు. పర్మార్ అప్పు ఎగ్గొట్టేందుకు, కంపెనీని చేజిక్కించుకునేందుకు పర్మార్‌ను హత్య చేయాలనుకున్నాడు. దీంతో కంపెనీ ఉన్న వసాయ్ (Vasai)లోని నాయక్పాడ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పర్మార్‌పై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ భుజానికి తలిగింది. మరోసారి కాల్పులు జరిపే ప్రయత్నంలో పిస్టల్ జామ్ అయ్యింది. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు సాగర్, అతడికి సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

