సిమ్లా: పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పింది. కింద నది ఉన్న లోయలోకి దూసుకెళ్లబోయింది. (Bus Skids) అదృష్టవశాత్తు అందులోని పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం చన్నిఖోడ్ సమీపంలోని భూంతర్-మణికరణ్ రహదారిపై పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి లోయలోకి దూసుకెళ్లబోయింది. అదృష్టవశాత్తూ బస్సు ముందు భాగం రోడ్డుపైకి వచ్చి ఆగింది. దీంతో లోయ కింద ప్రవహిస్తున్న పార్వతి నదిలో ఆ బస్సు పడే ప్రమాదం తప్పింది.
కాగా, ఆ బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించారు. బస్సులోని పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులు క్షేమంగా ఉండటంతో అంతా ఊరట చెందారు. లోయలోకి జారుతున్నట్లుగా ఉన్న బస్సు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨 Breaking | Kullu, Himachal Pradesh
A major road accident was narrowly avoided on the Bhuntar–Manikaran route in Kullu district on Thursday. A private bus carrying tourists lost control near Channi Khod in the Manikaran Valley but stopped at the roadside, preventing it from… pic.twitter.com/unh7j2CsUR
— The Modern Himachal (@themodernhp) January 29, 2026
Also Read:
Watch: మహిళను దారుణంగా కొట్టి.. లైంగికంగా వేధించిన బీజేపీ నేత
Sadhvi Prem Baisa | సాధ్వి అనుమానాస్పద మృతి.. సోషల్ మీడియా పోస్ట్‌పై పలు సందేహాలు
Woman Commando Murdered | గర్భిణీ మహిళా కమాండోను.. దారుణంగా హత్య చేసిన భర్త